KMM: ఇందిరా మహిళా డెయిరీ సంబంధించి సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్లను ఆయన ఆదేశించారు.