MHBD: జిల్లా MLA క్యాంప్ కార్యాలయంలో సోమవారం డా. భూక్య మురళి నాయక్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. DMB కెనాల్లో పూడిక, చెట్ల పొదల వల్ల నీటి ప్రవాహం ఆగుతుందని, ఇక పై నిర్లక్ష్యం సహించబోమని అధికారులను హెచ్చరించారు. రేవంత్ సర్కార్ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రామకృష్ణ, ఈఈ వీరస్వామి ఉన్నారు.