పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ధనత్రయోదశి డిమాండ్‌తో ఈ వారాంతంలో పుత్తడి ధర దేశవ్యాప్తంగా రూ. 1.30 లక్షలు దాటే అవకాశముంది. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి రూ. 1.50లక్షలకు చేరొచ్చని బులియన్ వర్గాలు అంచనా వేశాయి. అటు కిలో వెండి రూ. 2.50లక్షలు దాటొచ్చని చెబుతున్నాయి. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్ పెరగనుందని తెలుస్తోంది.