MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో బోధకాలు వ్యాధి నియంత్రణే లక్ష్యంగా టాస్ సర్వే నిర్వహించనున్నామని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డా.ఉమా శ్రీ తెలిపారు. సోమవారం జన్నారంలోని గాంధీ నగర్లో నిర్వహించిన సర్వేలో ఆమె పాల్గొన్నారు. రోటిగూడ గీత నగర్లో 15,16, మురిమడుగులో 17,18, కవ్వాల్ లో 21 ,22 తేదీలలో టాస్ సర్వే నిర్వహిస్తామన్నారు.