KNR: దీపావళి పండుగ సందర్భంగా స్మశాన వాటికలలో నిర్వహించే వేడుకలకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆయన అధికారులకు సూచనలు చేశారు. ఖార్కాన గడ్డ స్మశాన వాటికతో పాటు పలు ప్రాంతాల్లోని వాటికలను శుభ్రం చేసి, దీపావళికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.