HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో స్వతంత్య్ర అభ్యర్థులు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తొలిరోజే 10 నామినేషన్లు దాఖలు చేయగా.. మిగిలిన రోజుల్లోనూ నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్లో ‘మాలల పంతం-కాంగ్రెస్ అంతం’ అన్న నినాదంతో ముందుకు సాగుతామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ ప్రకటించింది.