సత్యసాయి: జిల్లాలో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, హిందూపురం, పెనుగొండ తదితర ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఆసక్తిగల వ్యాపారులు 18వ తేదీన పుట్టపర్తి రీజనల్ మేనేజర్ కార్యాలయంలో టెండర్ ఫారాలను సమర్పించవచ్చని, అదే రోజు బాక్స్ తెరిచి కేటాయింపుల ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.