KMM: సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియామకానికి ఈనెల 15న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రాత పరీక్షకు 60%, ఇంటర్వ్యూకు 40% వెయిటేజ్ ఇచ్చి తుది అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.