ATP: అనంతపురం సర్వజనాసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా మారుస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో 560 పడకలు ఉన్నాయని, వీటిని 1200 పడకలక పెంచుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే డీపీఆర్‌ను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే లక్ష్యమని అన్నారు.