అనకాపల్లి జిల్లాలో వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు అమల్లోకి వస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు అవసరమైన ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా పనులు కల్పించాలని తెలిపారు.