NLG: అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పీఎస్‌కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.