TG: HYD నగర పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులకు వచ్చేనెెల నుంచి సన్నబియ్యం ఇవ్వనున్నారు. దీంతోపాటు నిత్యావసర సరుకులు ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలైలో మొదటి దశగా కార్డులు జారీ చేయగా.. తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులను మంజూరు చేసింది. నగరవ్యాప్తంగా 6 లక్షల దరఖాస్తులు రాగా.. 1,54,276 కుటుంబాలను గుర్తించి కార్డులను జారీ చేసింది.