ATP: తాడిపత్రి నియోజకవర్గ విస్తృత స్థాయి టీడీపీ సమావేశంలో కాకర్ల బ్రదర్స్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. వర్గ, గ్రూపు, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ కార్యకర్తల్లో విభేదాలు సృష్టించినందుకు కాకర్ల రంగనాథ్ సోదరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలలో వీరు ఇకపై పాల్గొనరాదని సమావేశంలో తీర్మానించారు.