ADB: దేశంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆత్మ డైరెక్టర్ అందుసింగ్ అన్నారు. ఈ మేరకు నేరడిగొండ మండలంలో మంగళవారం సమావేశమై ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. నాయకులు మల్లేష్, లక్ష్మణ్, ఈశ్వర్, తదితరులున్నారు.