MHBD: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ నాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి దరఖాస్తు సమర్పించారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్, ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులకు దరఖాస్తులు అందజేశారు. గత కొన్నేళ్లుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని శ్రీకాంత్ కోరారు.