PDPL: ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించి 0.4 మిమీ ఎత్తు, 0.2 మిమీ వెడల్పు పెన్సిల్ గ్రాఫైట్పై ప్రపంచంలోనే అతిచిన్న జాతీయ పతాకాన్ని గంటపాటు శ్రమించి రూపొందించి ముంబైలో అవార్డు అందుకున్నారు. గతంలో ఆయన అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నారు.