MDCL: సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని మేడ్చల్ ప్రాంతంలో ఓ రైలులో రూ.8,000 విలువ చేసే మొబైల్ దొంగతనం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు చర్యలు చేపట్టడంతో దొంగ దొరికాడు. అతని నుంచి మొత్తం రూ.25,000 విలువచేసే మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.