MNCL: నైపుణ్యాల పెంపుతోనే ఉత్తమ విద్యా బోధన సాధ్యమవుతుందని కోడింగ్ కోర్స్ కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు బోధన చేసే ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.