MLG: జిల్లా DCC అధ్యక్ష పదవికి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి రాంరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవులు ఎస్టీలకు కేటాయించడంతో ఇతర సామాజిక వర్గాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైడాకుల అశోక్ రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యంలో, ఈసారి మల్లాడికి అవకాశం లభిస్తుందని జిల్లాలో చర్చ జరుగుతోంది.