E.G: నల్లజర్ల ఫ్లై ఓవర్ దగ్గర సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్వారకాతిరుమలకి చెందిన కె. రామచంద్ర రావు (45) నల్లజర్లలోని ఒక హోటల్ నందు పనిచేస్తున్నాడు. పని అనంతరం ఇంటికి వెళ్తున్న అతనిని ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.