ELR: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాలను సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో సోమవారం ఖరీఫ్ ధాన్యం సేకరణ లక్ష్యాలు, ప్రణాళికలపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఖరీఫ్‌లో రైతుల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని అన్నారు.