గ్రేటర్ హైదరాబాద్‌లో టైఫాయిడ్ విజృంభిస్తుంది. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన పరీక్షల్లో టైఫాయిడ్ కేసులు బయటపడ్డాయి. 584 మందికి పరీక్షలు నిర్వహించగా.. 110 మందికి టైఫాయిడ్ పాజిటివ్‌గా తేలింది. అయితే గాంధీ, ఉస్మానియా, నల్లకుంట ప్రభుత్వాసుపత్రిలో నిత్యం పదికిపైగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి.