NLG: మాడుగులపల్లి మండలం చింతలగూడెం కుక్కడం గ్రామంలో సీసీ రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. రోడ్డుపై నుంచి నీరు పారడానికి సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరు ఆగిపోయి బురదగా మారుతోంది. ప్రతి వర్షానికీ ఇదే పరిస్థితి వస్తుండడంతో, సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.