MDK: నిజాంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతిచెందాడనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలప్రకారం.. నిజాంపేటకు చెందిన జ్యోతి(41) బతుకుదెరువు కోసం మహబూబ్ నగర్ వెళ్లారు. అక్కడ ఆమె కొడుకు అనిల్ నెలరోజుల క్రితం పిట్స్ రావటంతో ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపంచెందిన జ్యోతి ఇంట్లో రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.