KDP: పులివెందులలోని పలు ఫ్రూట్ జ్యూస్ దుకాణాలను మున్సిపల్ కమిషనర్ రాముడు ఆదేశాల మేరకు సోమవారం పారిశుద్ధ్య, పర్యావరణ సిబ్బంది తనిఖీ చేశారు. ఫ్రూట్ జ్యూస్లలో ఎటువంటి రంగులు కానీ, రసాయనాలు కానీ కలపరాదని సూచించారు. తాజా పండ్లు, పరిశుభ్రమైన నీరు వాడాలని ఆదేశించారు. పాడైపోయిన పండ్లు వాడినా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.