KNR: హుజూరాబాద్ నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నిన్నటి వరకు ఎండ వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు ఉదయం చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందారు. హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం, ఇల్లందకుంటలో భారీ వర్షం కురుస్తూ పంటలు దెబ్బకు రైతులు ఆందోళన చెందుతున్నారు.