SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ 1వ వార్డుకు చెందిన సత్యవరం గ్రామానికి గత వారం రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కదిలి వచ్చిన పంచాయతీ అధికారులు మరమ్మత్తులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడ సమస్య ఉందో పరిశీలించి గుర్తించారు. వాటర్ ట్యాంకు వెళ్లవలసిన వాల్వ్ చెడిపోవడంతో మంగళవారం పనులు చేపట్టారు.