కృష్ణా: గూడూరు మండలం రాయవరం గ్రామం లోని డొంక రోడ్డులో రహస్య సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్ఐ సత్యనారాయణ జూదం శిబిరంపై నిన్న దాడి చేశారు.ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1) ప్రకారం జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ₹6,480/- నగదు, 5 మొబైల్ ఫోన్లు,3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.