GNTR: గుంటూరు జీఎంసీ పరిథిలోని 2వ వార్డు ఇజ్రాయెల్ పేటలో పారిశుద్ధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మంగళవారం ఉదయం చెత్తను తొలగించకుండా అక్కడే వదిలేశారు. అంతేకాకుండా చెత్త బయటకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్ కప్పేసి కవర్ చేసి చేతులు దులుపుకొన్నారు. వారి తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.