PDPL: నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్జీ-3 జీఎం నరేంద్ర సుధాకరరావు, ఇతర అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ… రామగుండం కోల్ మైన్ ప్రాజెక్ట్, ఓసీపీ–2 పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భద్రతతో కూడిన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు.