KMM: టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించే వేంకటేశ్వరస్వామి ఆలయానికి కావాల్సిన స్థలంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ అనుదీప్, ఆర్డీఓ జి.నరసింహారావు, తహసీల్దార్ డి. సైదులుతో సమావేశమైన ఆయన ఆలయ నిర్మాణానికి అనువుగా, ఎలాంటి వివాదాలు లేని స్థలాన్ని ఎంపిక చేసి టీటీడీ బృందానికి నివేదిక ఇవ్వాలని తుమ్మల తెలిపారు.