BPT: ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధానితో సీహెచ్ పవన్ గోపికృష్ణకు ముఖాముఖి పాల్గొనే అవకాశం లభించింది. ఈనెల 7న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జే పంగులూరు మండలం కొండ మంజులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి పవన్ ఎంపికయ్యారు.