ATP: గుంతకల్లు పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎక్స్చేంజ్ సీఐ శివసాగర్ మీడియాకు తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి అక్రమంగా తరలిస్తున్నారని రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. వారి వద్ద నుంచి 4 కేజీల గంజాయి, ఒక బైక్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.