GNTR: తెనాలిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ఎనీటైం మద్యంగా ఈ ప్రాంతాన్ని మార్చేశారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ వైసీపీ చేపట్టిన ధర్నాలో ఇవాళ పాల్గొన్న ఆయన ప్రభుత్వంతో పాటు మంత్రి మనోహర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెనాలి మొత్తం గుంటల మయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.