KNR: అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ స్వరూప ఆధ్వర్యంలో సోమవారం వెన్కెపల్లి పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను చేపట్టారు. ప్లాస్టిక్‌ను తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.