ప్రకాశం: సి ఎస్ పురం మండలంలోని అంబవరం జడ్పీహెచ్ఎస్లో సోమవారం పండుగ వాతావరణం నెలకొంది. నలుగురు ఉపాధ్యాయులు నూతనంగా విధులు చేపట్టడంతో పాఠశాలలోని ఉపాధ్యాయులు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతనంగా విధులలో చేరిన సోషల్, లెక్కలు, ఇంగ్లీష్, వ్యాయామ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.