KDP: కొండాపురం శాంతినగర్ కాలనీలో గత వారం నుంచి చెత్త సేకరణ వాహనం రాక కాలనీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త సేకరణ వాహనం రాకపోవడంతో ఇళ్లలోనే చెత్త పేరుకు పోతుంది. పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన, దోమలు పెరిగి రోగాలు వ్యాప్తి చెందుతాయని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కాలనీలోకి ప్రతిరోజు చెత్త సేకరణ వాహనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.