PDPL: మంథని గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంథనిలో రూ.40 కోట్ల వ్యయంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం పుట్టపాక గ్రామంలో శ్రీపాదరావు స్మారక బస్ షెల్టర్‌ను ప్రారంభించిన ఆయన, ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల మెరుగుపడతాయని అన్నారు.