KMM: ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా మున్నేరులో వరద నీరు చేరి జలకళ సంతరించుకుంది. మున్నేరు ఉగ్రరూపం చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.