HYD: వలస పక్షులను వీక్షించడానికి అక్టోబరు, నవంబరు నెలలు అనుకూలం కావడంతో ‘బర్డ్ వాక్’ క్యాంపులను నిర్వహిస్తున్నారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్, మంచిరేవుల ఫారెస్ట్ పార్కుతో పాటు శివారు ప్రాంతాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. పది నుంచి పదిహేను మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి శని, ఆదివారాలు ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు.