NGKL: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన దేశం అశోక్ రెడ్డి, దేశం సుమతమ్మ దంపతులు పొలం నుంచి ఆటోలో గ్రామానికి తిరిగి వస్తుండగా, సోమవారం సాయంత్రం మార్గమధ్యలో వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.