NRPT: చలికాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో పగటివేళ వాతావరణం పూర్తిగా చల్లగా మారింది. మాగనూరు మండలం నల్లగట్టు ప్రధాన రహదారి 167పై పొగ మంచు మంగళవారం ఉదయం చూపరులను కనువిందు చేసింది. మసక వెలుతురులో వాహనదారులు లైట్లు వేసుకొని వాహనాలు నడుపుతున్నారు. కాగా చలికాలంలో ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలతో బయటికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు.