KNR:సైదాపూర్ మండలంలోని పాడి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు తప్పకుండా వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి విహెచ్. విజేందర్ రావు కోరారు. బుధవారం నుంచి మండలంలోని అన్ని గ్రామాలలో పశువైద్య శిబిరం నిర్వహించి, టీకాలు వేయడం జరుగుతుందని సోమవారం ఆయన తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.