VSP: అడవివరం–దారపాలెం బీఆర్టీఎస్ రోడ్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. దారపాలెంలో సోమవారం పర్యటించారు. నవంబర్లో జరిగే అంతర్జాతీయ సదస్సు దృష్ట్యా రోడ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఎస్టీసీ రోడ్డులో పెండింగ్లో ఉన్న 350 మీటర్ల పనులు తక్షణం పూర్తి చేయాలన్నారు.