KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఈ నెల 16న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నన్నూరు గ్రామంలో నిర్వహించే సభా ప్రాంగణాన్ని మంత్రులు సత్య కుమార్, నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్ కలిసి ఇవాళ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు సూచించారు.