ATP: గుత్తికి చెందిన కౌసర్ బి తన భర్త నూరుద్దీన్ అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నట్లు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లిలో రూ. 4లక్షల నగదు, 15 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చామని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు మీడియాకు తెలిపారు.