కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజన్లలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న జవాన్లను మార్పు చేస్తూ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రేపటి నుంచి కొత్తగా కేటాయించిన డివిజన్లలో విధులు నిర్వర్తించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.