ADB: గిరిజన ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్, గాదిగూడ మండలాల్లో ఆదివాసీల అరుదైన పండుగ గుస్సాడీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నార్నూర్ మండలంలోని ఎంపల్లి(జీ) గ్రామంలో ఆదివాసీ పెద్దలు, మహిళలు కలిసి బోగి పూజలు నిర్వహించారు. అనంతరం తమ సంప్రాదయబద్దంగా గుస్సాడీ, దండారి వేడుకలను ప్రారంభించారు.