ASR: దేశ వ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)అమలులో భాగంగా, పర్యాటక, నిర్మాణ రంగాలకు సంబంధించిన తగ్గింపు ప్రయోజనాలను వెంటనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పర్యాటక సీజన్ దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త రేట్ల వల్ల కలిగే ఆర్థిక లాభాలపై దృష్టి సారించాలని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.