KMM: గంజాయి కేసులో ఇద్దరు నిందితులు పీడీ యాక్ట్ అమలుకు అర్హులని పేర్కొంటూ తెలంగాణ అడ్వైజరీ కమిటీ బోర్డు నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఖమ్మం రూరల్ ACP తిరుపతి రెడ్డి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో 179 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీస్ తనిఖీలో పట్టుబడ్డ పల్లపు రఘు(36), మహమ్మద్ ఖాజా పాషా (29) పై పీడీ యాక్ట్ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.